‘’జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’’ డిసెంబర్ 15న విడుదల

Tuesday,December 05,2017 - 12:20 by Z_CLU

నవీన్ చంద్ర నివేథ థామస్ జంటగా నటిస్తున్న సినిమా జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్. అనురాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రఘు బాబు చౌదరి మరియు కే.బి చౌదరి లు సంయుక్తంగా నిర్మిస్తుండగా సుకుమార్ దగ్గర పలు సినిమాలకు అసోసియేట్ గా పనిచేసిన అజయ్ వోదిరాల దర్శకత్వం వహిస్తున్నారు.

ఫస్ట్ లుక్, టిజర్ తోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన ఈ సినిమా ఈ మధ్యే సెన్సార్ పూర్తి చేసుకొని అన్ని హంగులతో డిసెంబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుంది. ఇప్పటికే మ్యూజికల్ గా కూడా హిట్ అందుకున్న ఈ సినిమా పై అభిమానుల్లోనూ మంచి అంచనాలే నెలకొన్నాయి.

మలయాళం సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ రతీష్ వేగ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
కెమెరా: గిరీష్ గంగాధరన్ మరియు ఆథర్ విల్సన్
ఎడిటింగ్: ఏస్.బి ఉద్భవ్
ఆర్ట్ రాజీవ్ నాయర్
దర్శకత్వం అజయ్ వోదిరాల