ఫుల్ గా కండలు పెంచిన ఎన్టీఆర్

Tuesday,March 13,2018 - 07:30 by Z_CLU

త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా మారిపోతున్నాడంటూ ఇన్నాళ్లూ చాలా పుకార్లు వచ్చాయి. అవి అంతో ఇంతో నిజం కూడా. కాకపోతే మేకోవర్ లో భాగంగా గడ్డం పెంచుతాడని, హెయిర్ స్టయిల్ లో మార్పులు చేస్తాడని చాలామంది భావించారు. కానీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎన్టీఆర్ కండలు పెంచాడు.

త్రివిక్రమ్ సినిమాలో కండలు తిరిగిన బాడీతో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. నిజానికి యంగ్ టైగర్ సిక్స్ ప్యాక్ లో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు కొందరు. ఫారిన్ ట్రయినర్ లాయిడ్ స్టీవెన్స్ గైడెన్స్ తో కళ్లుచెదిరే ఫిజిక్ సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ జిమ్ చేస్తున్న ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతోంది.

ఈ మజిల్ బాడీ ఎన్టీఆర్ కు 2 రకాలుగా పనికొస్తుంది. ఒకటి త్రివిక్రమ్ మూవీలో మేకోవర్ కోసమైతే.. రాజమౌళి డైరక్షన్ లో రాబోతున్న మల్టీస్టారర్ సినిమాకు కూడా ఈ జిమ్ బాడీ సూట్ అవుతుంది. ఇలా ఒకే మేకోవర్ తో 2 సినిమాలు కవర్ చేసే పనిలో పడ్డాడు యంగ్ టైగర్.