కోలీవుడ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ ?

Sunday,October 07,2018 - 04:01 by Z_CLU

లేటెస్ట్ గా ‘అరవింద సమేత’ షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ త్వరలోనే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాకు జాయిన్ కానున్నాడు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు యంగ్ టైగర్..  లేటెస్ట్ గా ‘మెర్సల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అట్లీ ప్రస్తుతం తారక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీ అయ్యాడని తెలుస్తుంది.

రాజమౌళి సినిమా తర్వాత కొరటాల శివతో కూడా ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు తారక్ ..అయితే అట్లీ సినిమా తర్వాతే కొరటాల సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. అన్నీ కుదిరితే తారక్ -అట్లీ కాంబో సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వని దత్ నిర్మించే చాన్స్  ఉంది.