12 ఏళ్ల కల.. ఇలా నెరవేరింది

Wednesday,October 10,2018 - 12:18 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ కొచ్చి 17 ఏళ్ళు పూర్తయింది… త్రివిక్రమ్ దర్శకుడిగా మారి 16 ఏళ్ళు గడిచింది.. వీరిద్దరూ కలిసి సినిమా చేయడానికి మాత్రం ఏకంగా పుష్కరం పట్టింది. కెరీర్ స్టార్టింగ్ నుండి స్టార్ డైరెక్టర్స్ అందరినీ కవర్ చేస్తూ వచ్చిన తారక్ ఎట్టకేలకు ‘అరవింద సమేత’ తో త్రివిక్రమ్ ని కూడా కవర్ చేసేసాడు.

ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అప్పుడు మొదలు కానుంది ఇప్పుడు మొదలు కానుంది అంటూ ఎన్నో ఏళ్లుగా ఎన్ని వార్తలొచ్చినా అది కార్య రూపం దాల్చడానికి పన్నెండేళ్ళు పట్టింది. ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తారక్ అభిమానుల కల ఎట్టకేలకు నెరవేరింది. మరో రెండు రోజులల్లో తారక్ – త్రివిక్రమ్ పవర్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ‘అరవింద సమేత’ అక్టోబర్ 11 నుండి రికార్డుల వేట మొదలు పెట్టనుంది. మరి ఇన్నేళ్ళ ఎదురుచూపులకు పులిస్టాప్ పెట్టిన ఈ సినిమా వీరిద్దరి స్టామినాతో ఏ రేంజ్ వసూళ్ళు సాదిస్తుందో..చూడాలి.