Salaar - ప్రభాస్ కి విలన్ అతనే?

Tuesday,May 25,2021 - 03:39 by Z_CLU

ప్రభాస్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘సలార్’ లో ఇంత వరకూ విలన్ గా కనిపించబోయే నటుడు ఎవరనేది ఫైనల్ అవ్వలేదు. మొన్నటి వరకూ పవర్ ఫుల్ విలన్ రోల్ కోసం కొంతమంది నటులను లిస్టౌట్ చేశారు. తాజాగా సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడుని తీసుకున్నారని టాక్ వినబడుతుంది. ప్రభాస్ సరసన జాన్ అబ్రహం విలన్ గా కనిపిస్తాడని ఇన్సైడ్ టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ ప్రకటించి జాన్ ని వెల్కం చెప్పబోతున్నారని తెలుస్తుంది.

KGF 2 లో విలన్ గా సంజయ్ దత్ ని తీసుకొని అతని గెటప్ తో ఎట్రాక్ట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ‘సలార్’ లో కూడా జాన్ ని కొత్త గెటప్ లో క్రూరంగా చూపిస్తూ అతని పాత్ర ద్వారా పవర్ ఫుల్ విలనిజం చూపించాలని భావిస్తున్నాడట. ఇక ప్రభాస్ కి విలన్ అంటే ఆ నటుడికి కూడా భారీ ఫిజిక్ ఉండాల్సిందే. బాడీ విషయంలో జాన్ కి పేరు పెట్టడానికి లేదు. అందుకే కొందరినీ విలన్ గా అనుకున్నప్పటికీ ఫైనల్ గా జాన్ అబ్రహంని ఫిక్స్ చేసుకున్నారట మేకర్స్.

ఇక తన ఎలివేషన్స్ సీన్స్ తో హీరోని ఒక రేంజ్ చూపించే ప్రశాంత్ నీల్ విలన్ ని కూడా అంతే పవర్ ఫుల్ గా చూపిస్తూ ఆకట్టుకుంటాడు. అలాగే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు హీరో -విలన్ మధ్య మంచి బలమైన సన్నివేశాలు రాసుకోవడంలోనూ ప్రశాంత్ టాలెంట్ తెలిసిందే. ఇక ‘సలార్’ లో ప్రభాస్ , జాన్ అబ్రహం మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు సన్నివేశాలు ఎలా ఉంటాయా అని జాన్ పేరు బయటికి వచ్చినప్పటి నుండి డిస్కషన్ నడుస్తుంది. వన్స్ మేకర్స్ విలన్ గా జాన్ అబ్రహం పేరు ప్రకటిస్తే సినిమాపై అంచనాలు ఇంకా అధికమవుతాయి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics