ఇది సాంగ్ కాదు.. జోగేంద్ర థీమ్

Tuesday,August 01,2017 - 11:31 by Z_CLU

మరికాసేపట్లో రానా నుంచి మరో హంగామా షురూ కాబోతోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన రానా, ఈరోజు సినిమాకు సంబంధించి ఓ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాడు. కాకపోతే దాన్ని పాటగా చెప్పడం లేదు యూనిట్. సినిమాలో రానా పోషించిన జోగేంద్ర క్యారెక్టర్ ఆధారంగా దీనికి ‘జోగేంద్ర థీమ్’ అని పేరుపెట్టారు.

బాహుబలి-2 లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత రానా ఎంతో ఇష్టపడి నటిస్తున్న సినిమా ఇది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై రానా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా స్టోరీతో పాటు, తన క్యారెక్టరైజేషన్ అందరికీ బాగా నచ్చుతుందంటున్నాడు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో రానా అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడట

కాజల్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 11న నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.