ఈ "జోడీ" అదిరింది

Wednesday,July 24,2019 - 12:15 by Z_CLU

హీరో ఆది సాయికుమార్ మరో సినిమా రెడీ చేశాడు. ఈ సినిమా పేరు జోడి. కంప్లీట్ లవ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను కొద్దిసేపటి కిందట రిలీజ్ చేశారు. జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాధ్ ఇందులో హీరోయిన్.

టీజర్ లో ఆది-శ్రద్ధశ్రీనాధ్ పెయిర్ బాగుంది. స్క్రీన్ పై వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగానే పండింది. ఫణి కల్యాణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇది పూర్తిగా ఓ ప్రేమకథా చిత్రమనే విషయాన్ని చెప్పడం కోసం టీజర్ లో ఆ సన్నివేశాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇందులో మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉందంటోంది యూనిట్.

గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. భావన క్రియేషన్స్ బ్యానర్ పై పద్మజ, సాయివెంకటేష్ నిర్మించిన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.