షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ధడక్’ మూవీ

Wednesday,April 18,2018 - 07:31 by Z_CLU

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ డెబ్యూ మూవీ ‘ధడక్’ సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లేట్ చేసుకుంది.  మరాఠి బ్లాక్ బస్టర్ ‘సైరత్’ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో జాహ్నవి కపూర్ తో పాటు, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖతార్ హీరోగా బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.

రాజస్థాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్  టైనర్ ఇద్దరికీ బెస్ట్ కరియర్ ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కరణ్ జోహార్. ఈ సినిమాకి అజయ్ – అతుల్ మ్యూజిక్ కంపోజర్స్.

లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా పై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయి ఉంది. ధర్మా ప్రొడక్షన్స్ , జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శశాంక్ ఖైతాన్ డైరెక్టర్.