జాహ్నవి కపూర్ ‘ధడక్’ 2 వీక్స్ కలెక్షన్స్

Friday,August 03,2018 - 02:03 by Z_CLU

జూలై 20 న రిలీజైన ‘ధడక్’  సక్సెస్ ఫుల్ గా 2 వారాలు పూర్తి చేసుకుంది. శ్రీదేవి కూతురు జాహ్నవి  కపూర్ చేసిన డెబ్యూ మూవీ కావడంతో రిలీజ్ కి ముందు నుండే సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే కరణ్ జోహార్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పాటు, జాహ్నవి, ఇషాన్ కతార్ పర్ఫామెన్సెస్ ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడంలో సక్సెస్ అయ్యాయి.

బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ వసూళ్లను రికార్డ్ చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 100 కోట్లు వసూలు చేసింది. ఇక ఇండియాలో ఇప్పటికే 62. 95 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, థియేటర్స్ లో ఇప్పటికీ అదే క్రేజ్ తో ప్రదర్శించబడుతుంది.

శశాంక్ ఖైతాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మరాఠి బ్లాక్ బస్టర్ సైరత్ కి రీమేక్ గా తెరకెక్కింది. అజయ్–అతుల్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు.