జెర్సీ – 90 మందిలో ఒకడి కథ

Friday,March 29,2019 - 10:05 by Z_CLU

ఎంతమంది తాము ఎంచుకున్న కరియర్ లో సక్సెస్ అవుతారు…? అందునా క్రికెట్ లాంటి స్పోర్ట్ లో..? 100 మందిలో మహా అయితే ఓ పది మంది మాత్రమే అనుకున్నది సాధించగలుగుతారు. అంటే తక్కిన 90 మంది ట్యాలెంట్ లేనివాళ్ళేనా..? అందుకే వాళ్ళు సక్సెస్ అవ్వలేదా..? ఈ క్వశ్చన్ కి సమాధానం నాని ‘జెర్సీ’ సినిమాలో దొరుకుతుంది.

రీసెంట్ గా ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు దర్శకుడు ‘గౌతమ్ తిన్ననూరి’. అసలు జెర్సీ ఎందుకంత స్పెషల్..? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానమిది. దాంతో ‘జెర్సీ’ ని జస్ట్ సినిమాగా ట్రీట్ చేసిన ఫ్యాన్స్, ఈ సినిమా తనకంటూ ఒక లక్ష్యం పెట్టుకున్న ప్రతి యంగ్ స్టర్ కథగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇలాంటి కంటెంట్ తో రాలేదు. మనకు హీరో అంటే సక్సెస్ అందుకున్నవాడే. కానీ గౌతమ్ ఓ అడుగు పక్కకు వేసి, ఫెయిల్యూర్ అనిపించుకుంటున్న క్రికెటర్ ని హీరోగా ఎంచుకున్నాడు. ఆ క్యారెక్టర్ ని సక్సెస్ ట్రాక్ ని ఎక్కించడానికి కావాల్సినంత ఎమోషన్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ డిఫెరెన్సే  ‘జెర్సీ’ ని బ్లాక్ బస్టర్ జోన్ కి క్వాలిఫై  చేస్తుందనిపిస్తుంది.

ఇప్పటి వరకు నానిని ‘పక్కింటబ్బాయి’ లా ట్రీట్ చేసేవాళ్ళు ఫ్యాన్స్. కానీ ఈ జెర్సీ’ రిలీజ్ తరవాత ఈ న్యాచురల్ స్టార్ తో తమను తాము కంపేర్ చేసుకునేంతగా ఈ సినిమా ఇన్స్ పైర్ చేస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయి.