జెర్సీ : నాని కి పెద్ద ఛాలెంజ్

Sunday,March 31,2019 - 09:30 by Z_CLU

హీరోగా 25 వ సినిమా వరకూ చేరుకున్నాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ లో ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన నానికి ‘జెర్సీ’ రూపంలో ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్ దొరికింది. నిజానికి స్పోర్ట్స్ సినిమాలో నటించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ముందుగా ఆ స్పోర్ట్ గురించి వివరంగా తెలుసుకోవాలి…. తర్వాత కొన్ని నెలల పాటు నేర్చుకోవాలి. నాని కూడా జెర్సీ కోసం ఇదే చేసాడు. జెర్సీ సినిమాను సెట్స్ పైకి తీసుకురాకముందే క్రికెట్ లో కొంత నైపుణ్యం పొందాడు. 70 రోజుల పాటు ఓ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు.

ఈ సినిమా కోసం టీం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా నానికి షూటింగ్ లో చాలా సార్లు గాయాలయ్యాయి. లేటెస్ట్ గా ‘జర్నీ ఆఫ్ జెర్సీ’ అంటూ ఓ వర్కింగ్ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో టీంతో పాటు నాని పడిన కష్టానికి, అలాగే అతని మొఖానికి అయిన గాయం చూసి ఆశ్చర్యపోవాల్సిందే.

జెర్సీ కోసం 130 మంది  ప్రొఫెషనల్ క్రికెటర్లు పని చేశారు. 2 అంతర్జాతీయ మైదానాల్లో.. 5 డొమెస్టిక్ గ్రౌండ్స్‌లో 25 రోజుల పాటు బ్రేక్ తీసుకోకుండా క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేసారు.