బాలీవుడ్ కు జెర్సీ

Tuesday,July 16,2019 - 11:13 by Z_CLU

తెలుగులో మోస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న జెర్సీ సినిమా ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి, ఈ రీమేక్ ను బాలీవుడ్ లో కూడా హ్యాండిల్ చేయబోతున్నాడు. అయితే ప్రొడ్యూసర్లు మాత్రం మారారు

అవును.. జెర్సీ రీమేక్ ను హిందీలో దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ కు మరికొన్ని మార్పులు చేసే పనిలో గౌతమ్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత స్టార్ కాస్ట్ సెలక్షన్ ఉంటుంది.

జెర్సీ సినిమా రిలీజ్ అయినప్పుడే చాలామంది బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమా రీమేక్ పై ఇంట్రెస్ట్ చూపించారు. రణ్వీర్ సింగ్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, షాహిద్ కపూర్ లాంటి హీరోలు ఈ సినిమాను ఆల్రెడీ చూసేశారు. వీళ్లలో ఒకరు జెర్సీ రీమేక్ లోకి ఎంటరయ్యే ఛాన్స్ ఉంది.

తెలుగులో ఈ సినిమాను నాని చేశాడు. తను తప్ప మరో హీరో ఈ క్యారెక్టర్ చేయలేడేమో అనిపించేంతలా నాని ఇందులో జీవించాడు. ఈ సినిమా క్లయిమాక్స్ చూసి కంటతడి పెట్టని తెలుగు ప్రేక్షకుడు లేడు. అలా తెలుగు సినీచరిత్రలో వెరీ వెరీ స్పెషల్ మూవీగా నిలిచిపోయిన జెర్సీ ఈ ఆదివారం (21న) జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డీ ఛానెల్స్ లో ప్రసారం కాబోతోంది. డోంట్ మిస్ ఇట్.