`జెర్సీ`... నా కెరీర్ లో మోస్ట్ హార్ట్ ట‌చింగ్‌, మ్యాజిక‌ల్ ఫిల్మ్

Tuesday,April 09,2019 - 04:28 by Z_CLU

జెర్సీ సినిమాను తన కెరీర్ లోనే మోస్ట్ హార్ట్ టచింగ్ మూవీగా చెబుతున్నాడు నాని. కథలు ఓకే చేయడానికి తను చాలా టైమ్ తీసుకుంటానని, కానీ ఫస్ట్ టైం జెర్సీ కథ విన్న వెంటనే సెట్స్ మీదుకు వెళ్లామని అంటున్నాడు

నా కెరీర్‌లో క్విక్‌గా… విన్న వెంట‌నే ఓకే చేసి, వెంట‌నే సెట్స్ మీద‌కు వెళ్లి, అనుకున్న ప్ర‌కారం విడుద‌ల‌కు వ‌చ్చిన సినిమా ఇది. షూటింగ్‌లో ఒకసారి ముక్కు కూడా ప‌గిలి ప‌క్క‌కు వెళ్లింది. క్రికెట్ ప‌రంగా ఆథెంటిగ్గా నేను చూసిన సినిమాల్లో, అంత డీటైలింగ్‌గా తెలుగులో వ‌చ్చిన తొలి సినిమా `జెర్సీ` అవుతుంది. సినిమా చూస్తుంటే క్రికెట్‌ని లైవ్‌లో చూసిన‌ట్టు అనిపిస్తుంది. ఎక్క‌డా సినిమా కోసం ఆడిన‌ట్టు ఉండ‌దు.”

జెర్సీ కథను లైట్ గా రివీల్ చేశాడు నాని. సినిమాలో హైదరబాదీ క్రికెటర్ గా కనిపిస్తాడట. అంతేకాదు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కూడా వస్తుందట. సినిమా కూడా 3 టైమ్ ఫ్రేమ్స్ లో నడుస్తుందని.. మోస్ట్ ఎమోషనల్ గా ఉంటుందని అంటున్నాడు.

అర్జున్ అనే వాడు నిజంగా ఉన్నాడా? ఇది ఫిక్ష‌న‌ల్ స్టోరీయా అనే డౌట్ అంద‌రికీ వ‌స్తుంది. అలా ఉంటుంది జెర్సీ సినిమా. ఒక‌రి క‌థ చూసి మ‌నం స్ఫూర్తి పొంద‌డం అనేది ఉంటుంది చూశారా.. అది అర్జున్‌ని చూసిన‌ప్పుడు అనిపిస్తుంది. సినిమా చూసిన‌ప్పుడు మాత్రం అర్జున్ క‌థ నిజ‌మ‌నిపిస్తుంది. హైదరాబాద్ ప్లేయ‌ర్‌గా అర్జున్ పాత్ర ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ప‌నిచేస్తున్న‌ట్టు చూపిస్తాం. 86, 96, 2018 సంవ‌త్స‌రాల‌ను చూపించాం సినిమాలో.

జెర్సీకి సంబంధించి మరో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా రివీల్ చేశాడు నాని. జ్యూక్ బాక్స్ నుంచి ఒక పాటను కావాలనే తప్పించామంటున్నాడు.

జ్యూక్ బాక్స్ లో ఐదు పాట‌లుంటాయి. ఒక స‌ర్ ప్రైజ్ సాంగ్‌ని సినిమాకు ముందు విడుద‌ల చేస్తాం. అనిరుద్ సంగీతం చాలా ఇష్టం నాకు. అత‌నితో వెంట వెంట‌నే రెండు సినిమాల‌కు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. క్లైమాక్స్ మ్యాచ్ 14 రోజులు చేశాం. ప్ర‌తి రోజూ రాత్రి 6.30కి మొద‌లైతే ఉద‌యం వ‌ర‌కు చేసేవాళ్లం. హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల విప‌రీత‌మైన చ‌లి అనిపించింది క‌దా… అప్పుడు షూట్ చేశాం.

ఇలా జెర్సీకి సంబంధించి చాలా డీటెయిల్స్ బయటపెట్టాడు నేచురల్ స్టార్. కానీ సినిమాలో కీలకమైన ఎమోషన్ ను మాత్రం చెప్పలేదు. అది సినిమా చూసి తెలుసుకోవాలంటున్నాడు. ఏప్రిల్ 19న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది జెర్సీ సినిమా.