బ్లాక్ బస్టర్ జెర్సీ.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,April 22,2019 - 11:47 by Z_CLU

వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన జెర్సీ సినిమా తన డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. మొదటి రోజు మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల 34 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా ఏపీ, నైజాంలో స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు ఎదురులేకుండా పోయింది. నాని అల్టిమేట్ యాక్టింగ్ కు గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ యాడ్ అవ్వడంతో మోస్ట్ ఎమోషనల్ మూవీగా అందర్నీ ఆకట్టుకుంటోంది జెర్సీ. మల్టీప్లెక్సుల నుంచి సి-సెంటర్ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు.

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ షేర్స్

నైజాం – రూ. 4.92 కోట్లు
సీడెడ్ – రూ. 1.20 కోటి
ఉత్తరాంధ్ర – రూ. 1.32 కోట్లు
ఈస్ట్ – రూ. 0.89 కోట్లు
వెస్ట్ – రూ. 0.73 కోట్లు
గుంటూరు – రూ. 0.82 కోట్లు
కృష్ణా – రూ. 0.78 కోట్లు
నెల్లూరు – రూ. 0.36 కోట్లు