మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన జెర్సీ

Wednesday,April 24,2019 - 04:07 by Z_CLU

బ్లాక్ బస్టర్ హిట్ అయిన జెర్సీ సినిమా ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని జెర్సీకి ఓవర్సీస్ లో 10లక్షల డాలర్లు వచ్చాయి.

జెర్సీ సినిమాతో నాని ఖాతాలో చేరిన మిలియన్ డాలర్ క్లబ్ మూవీస్ సంఖ్య 6. ఇంతకుముందు ఈగ, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, నేను లోకల్, నిన్నుకోరి సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. వీటిలో నాని కెరీర్ లో ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా భలే భలే మగాడివోయ్. ఆ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ ను మరో 3 రోజుల్లో క్రాస్ చేయబోతోంది జెర్సీ.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా జెర్సీ సినిమా స్ట్రాంగ్ గా నడుస్తోంది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని నైజాంలో ఈ సినిమా 6 కోట్ల మార్క్ (షేర్) అందుకుంది. మరో 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధించే అవకాశాలున్నాయి.