ఎన్టీఆర్-చరణ్ మల్టీ స్టారర్ సినిమాలో ఆ హీరో లేడు.

Sunday,April 01,2018 - 09:00 by Z_CLU

తారక్ -చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించ నున్న మల్టీ స్టారర్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ ఓ కీ రోల్ ప్లే చేయబోతున్నాడన్న వార్త పై క్లారిటీ ఇచ్చారు జీవిత. అసలు రాజమౌళి గారు ఇంత వరకూ రాజశేఖర్ గారిని ఆ సినిమా కోసం సంప్రదించిందే లేదని, ఇటివలే శివాని సినిమా ప్రారంభోత్సవానికి గెస్ట్ గా వచ్చినందుకే ఈ రూమర్ పుట్టి ఉండొచ్చని ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు జీవిత.

జీవిత వ్యాఖ్యతో నిన్నటి వరకూ ఈ విషయంపై క్రియేట్ అయిన సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ క్రేజీ మల్టీ స్టారర సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నాడు.