కాజల్ తో కలిసి...

Friday,November 04,2016 - 04:00 by Z_CLU

‘రంగం’ వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా ప్రస్తుతం తెలుగులో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. నిజానికి రంగం తరువాత జీవా నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో డబ్ అయినప్పటికీ విజయాలు మాత్రం అందుకోలేకపోయాయి. అందుకే ఈ సారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ తో కలిసి థియేటర్ లో అడుగుపెట్టబోతున్నాడు.

img_7372-mail-1

  జీవా, కాజల్ జంటగా రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాగా తెరకెక్కిన ‘కవలై వేండాం’ అనే చిత్రం తెలుగు లో ‘ఎంత వరకూ ఈ ప్రేమ’ పేరు తో త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని డీవీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత డి.వెంకటేష్ తెలుగు అనువదిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ చాలా హాట్ గా కనిపించనుందని జీవా-కాజల్ మధ్య వచ్చే రొమాంటికల్ సన్నివేశాలు హైలైట్ నిలుస్తాయనే టాక్ వినిపిస్తుంది. మరి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ తో కలిసి వస్తున్న జీవా ఈ సారైనా రంగం లాంటి విజయం అందుకుంటాడా? లేదో చూడాలి..