మహేష్ 'మహర్షి' నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్

Wednesday,August 22,2018 - 06:40 by Z_CLU

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. ఇటివలే ఫస్ట్ లుక్ పోస్టర్ తో మెస్మరైజ్ చేసిన ఈ సినిమాలో అలనాటి కథానాయిక జయప్రద మహేష్ కి అమ్మగా నటించనుందని సమాచారం. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి దాదాపు 50 సినిమాల్లో నటించింది జయప్రద. అప్పట్లో కృష్ణ – జయప్రదలది సూపర్ హిట్ కాంబినేషన్. మళ్ళీ ఇన్నేళ్ళకి జయప్రద కృష్ణ తనయుడు మహేష్ తో కలిసి  ఈ సినిమాలో నటిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటివలే గోవాలో మహేష్ -పూజా హెగ్డే లపై ఓ సాంగ్ ను షూట్ చేసిన యూనిట్ త్వరలోనే యు.ఎస్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే జయప్రద టీంతో జాయిన్ కానుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ వార్తపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అశ్వినీదత్ , దిల్ రాజు, పి.వి.వి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.