కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా జవాన్

Tuesday,May 30,2017 - 03:28 by Z_CLU

టాకీపార్ట్ కి ప్యాకప్ చెప్పేసింది సాయి ధరమ్ తేజ్ జవాన్ టీమ్. సాయి ధరం తేజ్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ ఆగష్టు రిలేజ్ కి పరుగులు పెడుతుంది. జూన్ లో బ్యాలన్స్ ఉన్న రెండు ఫైట్స్, సాంగ్స్ తెరకెక్కించి వీలైనంత తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసేసుకోవాలనే ఆలోచనలో ఉంది జవాన్ టీమ్.

సరిహద్దుల్లో ఉంది దేశాన్ని కాపాడే జవాన్ ఎంత అవసరమో, ప్రతి కుటుంబానికి అలాంటి హీరో కూడా అంతే అవసరం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘జవాన్’ సాయి ధరమ్ తేజ్ కరియర్ లో ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

దిల్ రాజు సమర్పణలో రిలీజ్ కానున్న ఈ సినిమా BVS రవి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది.