సాయిధరమ్ తేజ 'జవాన్' మూవీ ప్రీ లుక్

Thursday,June 08,2017 - 06:09 by Z_CLU

మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ ప్రీ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ట్రెండ్ అవుతుంది.  బి.వి.ఎస్.రవి డైరెక్షన్ లో యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే టాకీ పార్ట్ ఫినిష్ చేసుకుంది.

సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడే జవాన్ ఎంత అవసరమో, ప్రతి కుటుంబానికి అలాంటి హీరో కూడా అంతే అవసరం అనే కాన్సెప్ట్ తో ఇంటికొక్కడు అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ‘జవాన్’ ప్రీ లుక్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు మేకర్స్.

దిల్ రాజు సమర్పణలో BVS రవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కృష్ణ నిర్మిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు.