జవాన్ సెట్స్ పైకి వచ్చేశాడు

Wednesday,March 29,2017 - 01:20 by Z_CLU

సాయిధరమ్ తేజ్ “జవాన్” ఈరోజు నుంచి సెట్స్ పైకి వచ్చేసింది. జనవరిలో యంగ్ టైగర్ NTR చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ సినిమా ఇవాల్టి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. B.V.S. రవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది.

హరీష్ శంకర్, కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. విన్నర్ లాంటి క్లాస్ హిట్ తరవాత మరో డిఫెరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా, తన కరియర్ కి పెద్ద ప్లస్ కావడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సాయి ధరం తేజ్.