జవాన్ షూటింగ్ పూర్తి.. నవంబర్ లో రిలీజ్

Saturday,September 23,2017 - 02:30 by Z_CLU

బీవీఎస్ రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా జవాన్. ఓ బాధ్యత కలిగిన యువకుడి పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. నవంబర్ లో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ ట్రాక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

జవాన్ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.