'జవాన్' రిలీజ్ డేట్

Wednesday,June 28,2017 - 06:00 by Z_CLU

సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బివిఎస్ రవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘జవాన్’ మూవీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న నుంచి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది.

లేటెస్ట్ గా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని చివరి షెడ్యూల్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ అంచనాలు నెలకొల్పుతుంది. మిగిలిని షూటింగ్ పార్ట్ ని జులైలో పూర్తి చేసి సెప్టెంబ‌ర్ 1న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప‌క్కాఫ్యామిలి స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో సెప్టెంబర్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడన్నమాట మెగా హీరో సాయిధరమ్ తేజ్.