క్లాస్ డైరెక్టర్ సినిమాలో మాస్ సాంగ్

Friday,December 27,2019 - 05:48 by Z_CLU

కొంత మంది క్లాస్ డైరెక్టర్స్ నుండి మాస్ సాంగ్స్ ఊహించలేం. వారు ఎంచుకునే కథలను బట్టి అలాంటి సాంగ్స్ కి వారి సినిమాలో ప్రాదాన్యత ఉండదు. అయితే ఎవరూ ఊహించని విధంగా క్లాస్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న తన సినిమాలో ఫస్ట్ టైం ఓ మాస్ సాంగ్ పెట్టాడు. కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఎంత మంచి వాడవురా’ నుండి మూడో సింగిల్ గా ‘జాతరో జాతర’ అనే మాస్ సాంగ్ రిలీజయింది.. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది.

ఎక్కువ శాతం సాఫ్ట్ , మెలోడీ సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేసే గోపి సుందర్ చాన్నాళ్ళకి మళ్ళీ ఓ అదిరిపోయే మాస్ సాంగ్ తో మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాడు. పల్లెటూరి జాతరలో వచ్చే ఈ ఐటెం సాంగ్ కు మాస్ ఆడియన్స్ మెచ్చేలా లిరిక్స్ అందించాడు శ్రీమణి. ఇక రాహుల్ సిప్లిగంజ్ ,సాహితి సింగింగ్ కూడా సాంగ్ కి ప్లస్ అయింది. అలాగే కళ్యాణ్ రామ్ ఎనర్జిటిక్ డాన్సులు , నటషా దోషి అందాల ఆరబోత సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యేలా కనిపిస్తుంది.  ఓవరాల్ గా ‘ఎంత మంచి వాడవురా’ నుండి రిలీజైన ఈ మాస్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.