రెండో సినిమాకు రెడీ అవుతున్న శ్రీదేవి కూతురు

Monday,August 20,2018 - 06:43 by Z_CLU

శ్రీదేవి కూతురు అనే ఇమేజ్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వి కపూర్, తొలి సినిమా దఢక్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మరాఠీ మూవీ సైరాట్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. కొత్త హీరోహీరోయిన్లతో తెరకెక్కిన ఏ సినిమాకు రానన్ని వసూళ్లు దఢక్ కు వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమా వంద కోట్ల మార్క్ అందుకుంది. అలా ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జాన్వి, ఇప్పుడు తన రెండో సినిమాకు రెడీ అవుతోంది.

దఢక్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కరణ్ జోహార్ బ్యానర్ పైనే తన రెండో సినిమా చేయబోతోంది జాన్వి. అంతేకాదు, ఈ మూవీ తర్వాత చేయబోతున్న మూడో సినిమా కూడా కరణ్ జోహార్ బ్యానర్ పైనే చేయడానికి అంగీకరించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో స్పీడ్ పెంచింది జాన్వి కపూర్.

జాన్వి రెండో సినిమాకు తఖ్త్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక మూడో సినిమాగా సీక్వెల్ చేయబోతున్నారు. గతంలో హిట్ అయిన దోస్తానా సీక్వెల్ లో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది జాన్వి.