27 న 'జనతా గ్యారేజ్' సెన్సార్

Monday,August 22,2016 - 05:16 by Z_CLU

 

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కొరటాల శివ దర్శకత్వం లో నటిస్తున్న తాజా చిత్రం ‘ జనతా గ్యారేజ్’ విడుదలకి ముస్తాబవుతుంది. ఇటీవలే కాజల్ పై ఐటెం సాంగ్ చిత్రీకరించారు యూనిట్. . ఈ పాటతో సినిమాకు సంబంధించిన షూటింగ్  పూర్తయ్యింది. 27 న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2 న విడుదలకానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి.’నాన్నకు ప్రేమతో’ వంటి సూపర్ హిట్ తరువాత తారక్ నటిస్తున్న చిత్రం కావడం, వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల నుండి వస్తున్న మూడు సినిమా కావడం, ఇక ట్రైలర్స్ తో పాటు సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకోవడం తో ఈ చిత్రం టాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది.