ఎన్టీఆర్ మొదటి రోజు సంపాదన ఎంత...?

Friday,September 02,2016 - 07:42 by Z_CLU

ఎన్.టి.ఆర్  తొలి రోజే కలెక్షన్స్ తో దుమ్ముదులిపేసాడు. అభిమానులతో  పాటు  అందరూ ఔరా అనేలా చేసాడు యంగ్ టైగర్.  ఇక భారీ అంచనాల నడుమ, పెద్ద ఎత్తున విడుదలైన ‘జనతా గ్యారేజ్’ చిత్రం మొదటి రోజే కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. కొరటాల శివ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తొలి రోజే భారీ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. గతం లో కొరటాల దర్శకత్వం లో వచ్చిన ‘మిర్చి’,’శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడం, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ట్రైలర్ , సాంగ్స్ అందరినీ ఆకట్టుకోవడం తో ఈ సినిమా తొలి రోజే చూసేందుకు ఎన్.టి.ఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి కనబరిచారనే చెప్పాలి. నిన్న విడుదలై అన్ని ఏరియాలలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఏపి, తెలంగాణ లో మొత్తం కలిపి 20.56 కోట్ల వరకూ సాధించింది. ఓవర్సీస్ లో 5 కోట్లు,కర్ణాటక లో 3.5 కోట్లు, కేరళ లో 78 లక్షలు, తమిళ్ నాడు లో 26 లక్షలు కొల్లగొట్టగా రెస్ట్ అఫ్ ఇండియా లో 45 లక్షలు వసూలు చేసింది. ఇక గుంటూరు,కృష్ణ , ఈస్ట్, వైజాగ్ వంటి ఏరియాస్ లో జనతా తో సరి కొత్త రికార్డులు కూడా నెలకొల్పాడు యంగ్ టైగర్ .