జంబలకిడిపంబ : చిన్న సినిమాపై పెద్ద ఫోకస్

Thursday,June 21,2018 - 01:22 by Z_CLU

ప్రతి వారం టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. స్టార్ ఎట్రాక్షన్ పక్కనపెడితే వాటిలో స్ట్రయిట్ సినిమాలే ఎక్కువ. కానీ ఈ వీకెండ్ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈ వీకెండ్ డబ్బింగ్ సినిమాలు 2 రిలీజ్ అవుతుండగా.. స్ట్రయిట్ మూవీ ఒకే ఒక్కటి. అదే జంబలకిడిపంబ.

పేరుకు ఇది చిన్న సినిమానే. స్మాల్ బడ్జెట్ మూవీనే. కానీ ఎన్నో రీజన్స్ వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీటిలో ఒక మెయిన్ రీజన్ టెక్నికల్ టీం. అవును.. గోపీసుందర్ లాంటి సంగీత దర్శకుడు, రాజీవ్ నాయర్ లాంటి ఆర్ట్ డైరక్టర్, సతీష్ ముత్యాల లాంటి కెమెరామెన్ ఈ సినిమాకు వర్క్ చేశారు. పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి.

ఇక జంబలకిడిపంబ మూవీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి మరో రీజన్ టైటిల్. గతంలో ఈవీవీ సత్యనారాయణ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ టైటిల్ ఇది. అప్పట్లో ఆ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. సేమ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందనే అంచనాలున్నాయి.

సినిమాలో మరో ఎట్రాక్టివ్ ఎలిమెంట్ స్టార్ కాస్ట్. ఎలాంటి సీన్ అయినా పండించగల శ్రీనివాసరెడ్డి ఇందులో హీరోగా నటించాడు. సిద్ధి ఇద్నానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోసాని, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ధన్ రాజ్, జబర్దస్త్ అప్పారావ్ లాంటి కామెడీ గ్యాంగ్ ఈ సినిమాలో ఉంది. సో.. సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ నవ్వులు గ్యారెంటీ.

ఇన్ని ఎట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టే జంబలకిడిపంబ సినిమా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. మను డైరక్ట్ చేసిన ఈ సినిమాను రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి కలిసి నిర్మించారు.