ప్రమోషనల్ సాంగ్ తో హల్చల్ చేస్తున్న 'జంబలకిడిపంబ'

Sunday,June 03,2018 - 12:36 by Z_CLU

శ్రీనివాస్ రెడ్డి హీరోగా హిలేరియస్ ఎంటర్ టైనర్  గా తెరకెక్కిన సినిమా ‘జంబలకిడి పంబ’.  ఈ సినిమా రెగ్యులర్ కామెడీ సినిమాలకు భిన్నంగా ఉంటుందనే టాక్ ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. శ్రీనివాస్ రెడ్డి, సిద్ది, వెన్నెల కిషోర్, పోసాని, హరితేజ, ధన్ రాజ్  పై షూట్ చేసిన ఈ సాంగ్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న లవ్ కపుల్, చిన్న చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల విడాకులు తీసుకోవాలి అనుకునే టైమ్ లో, ఇద్దరి లక్షణాలు చేంజ్ అయిపోవడం సినిమాలో కీ పాయింట్ అని తెలుస్తుంది. భార్య లక్షణాలు భర్తకి, భర్త లక్షణాలు భార్యకి ట్రాన్స్ ఫర్ అవ్వడంతో పడే ఇబ్బందులు సినిమాలో మెయిన్ హిలేరియస్ ఎలిమెంట్ కానుంది.

శ్రీనివాస్ రెడ్డి సరసన సిద్ధి ఇద్నాని జంటగా నటించిన ఈ సినిమాకి J.B. మురళీ కృష్ణ డైరెక్టర్. రవి, జోజో జోస్,  శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.