రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న జంబలకిడి పంబ

Saturday,June 09,2018 - 12:30 by Z_CLU

శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ‘జంబలకిడి పంబ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన ఈ సినిమా జూన్ 22 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. జస్ట్ టైటిల్ తోనే పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా, రీసెంట్ గా రిలీజైన  ప్రోమోసాంగ్ తో  సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అనే లెవెల్ లో ఎట్రాక్ట్  చేస్తుంది.

కొత్తగా పెళ్ళైన జంటలో వచ్చే చిన్న చిన్న విబేధాలు, దాంతో విడాకులు తీసుకుందామని ఫిక్స్ అయిన జంట సడెన్ గా ఆడ మగగా, మగ ఆడగా మారడం దానివల్ల న్యాచురల్ గా క్రియేట్ అయ్యే కామెడీ సినిమాలో హైలెటెడ్ ఎలిమెంట్ కానుంది.

శ్రీనివాస్ రెడ్డి సరసన సిద్ధి ఇద్నాని జంటగా నటించిన ఈ సినిమాకి J.B. మురళీ కృష్ణ డైరెక్టర్. రవి, జో జో జోన్, శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలు. ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్.