జంబలకిడి పంబ డైరెక్టర్ J.B. మురళీ కృష్ణ ఇంటర్వ్యూ

Monday,June 18,2018 - 05:55 by Z_CLU

బాడీ స్వాపింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ‘జంబలకిడి పంబ’ సినిమా. శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 22 న గ్రాండ్ గా రిలీజవుతుంది. సినిమా  టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు క్రియేట్ అయిన వైబ్స్, రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు J.B. మురళీకృష్ణ మీడియాతో తన అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

 

అదీ లెక్క…

కథ ఫస్ట్ చెప్పింది జోజోకే… చెప్పగానే ఆయనకి నచ్చేసింది. కాకపోతే ఆయన ఒక్కరే ప్రొడ్యూస్ చేయలేరు కాబట్టి పార్ట్ నర్స్ ని చూసుకోవాల్సి వచ్చింది. అక్కడి నుండి బిగిన్ అయితే ఇంకా 114 మందికి కథ చెప్పాను. ఆ తర్వాత 115 రవిగారు, 116 శ్రీనివాస్ రెడ్డి గారు.  ఆ తరవాత  కూడా చాలా మందికి చెప్పాను కానీ కన్విన్స్ చేయడానికి కాదు, బెటర్ మెంట్ కోసం…

 

కుడి ఎడమైతే…

నేను ఫస్ట్ అనుకున్న టైటిల్ ‘కుడి ఎడమైతే’. ఆ తరవాత ప్రొడ్యూసర్స్ ఈ టైటిల్ సజెస్ట్ చేశారు. ఇ. వి. వి. గారి ‘జంబలకిడి పంబ’ రేంజ్ లో ఈ సినిమా ఎంటర్ టైన్ చేస్తుందని చెప్పుకుంటే అహంకారమవుతుందేమో కానీ, ఆ సినిమా పేరైతే డెఫ్ఫినేట్ గా నిలబెడతాం…

 

పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

ఇప్పుడున్న జెనెరేషన్ లో కపుల్ ఫేస్ చేస్తున్న నార్మల్ ఇష్యూతో పాటు, జెండర్ స్వాపింగ్ అనేది సినిమాలో హిలేరియస్ పాయింట్. సినిమా మాత్రం కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు చాలా రీచ్ అవుతుంది.

 

నేనలా అనుకోలేదు కానీ…

నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నపుడు కూడా శ్రీనివాస్ రెడ్డిని హీరో అనుకుని రాసుకోలేదు. కానీ… ఆయన ఈ రోల్ ప్లే రోల్ చేయడం వల్ల క్యారెక్టర్ ఇంకా చాలా బాగా ఎలివేట్ అయింది.

 

అదే మెయిన్ కాన్సెప్ట్…

ఈ జెనెరేషన్ లో చిన్నచిన్న మనస్పర్థలకే విడాకులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకరి ప్లేస్ ఒకరు ఉండి చూస్తేనే కానీ, అసలు  సమస్య ఏంటనేది  అర్థం కాదు…  అదే  ఈ  సినిమా మెయిన్ కాన్సెప్ట్…

 

అల్లరి నరేష్ పర్మిషన్…

సినిమాకి ఈ టైటిల్ ఫిక్స్ చేసుకునే ముందు అల్లరి నరేష్ తో కూడా మాట్లాడాం. E.V.V. గారు లేరు కాబట్టి ఈ టైటిల్ ని వాడేసుకోవడం మాకు కరెక్ట్ అనిపించలేదు. అందుకే నరేష్ గారితో డిస్కస్ చేశాం. ఆయన కూడా ఈ స్టోరీకి  ఇదే  పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పారు…

 

రైట్ రైట్ సినిమా…

నేను రీమేక్ సినిమాలు చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు కానీ, M.S. రాజు గారు పిలిచి ‘రైట్ రైట్’ సినిమా చేయమని చెప్పడంతో చేశాను…

 

36 మంది తరవాత…

ముంబై లో 36 మందిని ఆడిషన్ చేస్తే ఈ అమ్మాయి రెండో అమ్మాయి. అప్పటికే నేను సిద్ధిని ఫిక్సయిపోయా.. కాకపోతే హైదరాబాద్ కి వచ్చి అందరితో డిస్కస్ చేసిన  తరవాత  ఫైనల్ చేశాం. అందునా సిద్ధి థియేటర్ ఆర్టిస్ట్. నెల రోజుల ముందే ఇక్కడికి వచ్చి తెలుగు ట్రైనింగ్ తీసుకుని మరీ, ప్రతి డైలాగ్ తనే చెప్పి పర్ఫామ్ చేసింది…

 

అందుకే గోపీ సుందర్…

నేను మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కి స్టోరీ చెప్పగానే చాలా ఎగ్జైటెడ్ అయిపోయాడు. కేరళలో ఉండి ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశాం. అద్భుతంగా వచ్చింది.