రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కామెడీ ఎంటర్టైనర్

Thursday,May 17,2018 - 11:03 by Z_CLU

డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ‘జంబలకిడిపంబ’ మూవీ. రీసెంట్ గా నాని రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా షూటింగ్ కి కంప్లీట్ గా ప్యాకప్ చెప్పిన ఫిల్మ్ మేకర్స్,  జూన్ 14 న మువీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

‘బాడీ స్వాపింగ్’ వల్ల సినిమాలోని లీడ్ రోల్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ కానుంది. అవుట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్  టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి సరసన సిద్ధి ఇద్నాని హీరోయిన్ గా నటిస్తుంది. రవి, జో జో జోన్, శ్రీనివాస రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్. జె.బి మురళీ కృష్ణ ఈ సినిమాకి దర్శకుడు.