‘జై సింహా’ లో కీ పాయింట్ రివీల్ చేసిన బాలయ్య

Tuesday,January 09,2018 - 12:11 by Z_CLU

జనవరి 12 న గ్రాండ్ గా రిలీజవుతుంది బాలయ్య ‘జై సింహా’ K.S. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. అయితే ఈ సందర్భంగా డైరెక్టర్ K.S. రవికుమార్ తో తన అనుబంధం గురించి చెప్పుకున్నారు బాలయ్య.

‘డైరెక్టర్ ఎవరైనా, స్టార్ ఎవరైనా ఒకరికొకరు రిలేట్ అయి కనెక్ట్ అయితే కానీ పని చేయలేం. అలాంటిది K.S. రవికుమార్ తో సినిమా చేయాలన్నది నా ఎనిమిదేళ్ళ కల. ఈనాటికి నెరవేరింది. ఈ సినిమా కోసం K.S. రవి కుమార్ ఆయన టీమ్ తో కలిసి పడ్డ కష్టం రేపు స్క్రీన్ పై చూస్తే మీకు తెలిసిపోతుంది.’ అని డైరెక్టర్ తో తన రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన బాలయ్య సినిమాలోని కీ పాయిట్ రివీల్ చేశారు.

‘ప్రేమను అందరికీ పంచమనే సందేశమే’ జై సింహా అని చెప్పిన బాలకృష్ణ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ఆపని చేసిన ప్రతి టెక్నీషియన్ ని అప్రీషియేట్ చేశారు. చిరాంతన్ భట్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని C. కళ్యాణ్ నిర్మించారు.