సెప్టెంబర్ 3న జై లవకుశ సాంగ్స్

Wednesday,August 30,2017 - 01:44 by Z_CLU

NTR జై లవకుశ సాంగ్స్ సెప్టెంబర్ 3 న ఆన్ లైన్ లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా సాంగ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే భారీగా కురుస్తున్న వర్షాలు ఓ వైపు, వినాయక నిమజ్జనం సందర్భంగా జరుగుతున్న హడావిడిని మైండ్ లో పెట్టుకుని, ఎటువంటి ఆడియో రిలీజ్ ఈవెంట్ లేకుండానే సాంగ్స్ ని రిలీజ్ చేసేస్తుంది JLK టీమ్.

NTR ప్రతి సినిమా లాగే ఈ సినిమా ఆడియో ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసిన సినిమా యూనిట్, ప్రాక్టికల్ గా వర్కవుట్ కాకపోవడంతో, సెప్టెంబర్ 10 న ఆడియో సక్సెస్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది. అదే రోజు ఈ సినిమా ట్రేలర్ ని కూడా రిలీజ్ చేయనుంది JLK టీమ్.

ఇప్పటికే రిలీజైన జై, లవ కుమార్ టీజర్స్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసి, కుశ క్యారెక్టర్ పై బోలెడన్నీ స్పెక్యులేషన్స్ క్రియేట్ చేశాయి. ఈ లోపు సాంగ్స్ రిలీజ్ అనగానే ఫ్యాన్స్ లో న్యాచురల్ గానే ఫీస్ట్ సీజన్ బిగిన్ అయిపోయింది. NTR ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న రిలీజ్ కానుంది.