శ్రీరామ నవమి నాడు జై లవకుశ లోగో

Monday,April 03,2017 - 03:16 by Z_CLU

ఎన్టీఆర్ ‘జై లవకుశ’ లోగో లాంచ్ కి టైం అండ్ డేట్ ఫిక్సయింది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లోగో ఏప్రిల్ 5 న శ్రీరామ నవమి రోజు మార్నింగ్ 10:30 కి లాంచ్ చేస్తుంది సినిమా యూనిట్. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

NTR మూడు డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో ఎంటర్ టైన్ చేయనున్న ఈ సినిమా పై బిగినింగ్ నుండే బోలెడన్నీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు క్యూరాసిటీ క్రియేట్ చేస్తున్న టైటిల్, ఇప్పటికే సినిమాపై కావాల్సినంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేసింది. ఈ లోపు శ్రీరామ నవమి నాడు లోగో రిలీజ్ అనగానే ఫ్యాన్స్ ఈ అప్ డేట్ ని ఫీస్ట్ లా రిసీవ్ చేసుకుంటున్నారు.