'జై లవకుశ' టీజర్ లీక్

Wednesday,June 28,2017 - 11:46 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘జై లవకుశ’ టీజర్ ను వచ్చేనెల మొదటివారంలో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే మేకర్స్ కంటే ముందే లీకేజ్ రాయుళ్లు రెడీ అయిపోయారు. అవును.. వచ్చే వారం విడుదల కావాల్సిన జై లవకుశ టీజర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో యూనిట్ తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.

జై లవకుశ టీజర్ లీక్ అయిందని తెలుసుకున్న వెంటనే యూనిట్ అప్రమత్తమైంది. వీడియోను లీక్ చేసిన వ్యక్తుల్ని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. టీజర్ కు సంబంధించిన వీడియో క్లిప్స్ తో పాటు, స్టిల్స్ ను ఎవరూ షేర్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తోంది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్.

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఇందులో ఫస్ట్ టైం మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడనే వార్త సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఆ హైప్ ను క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యక్తులు జై లవకుశ టీజర్ ను లీక్ చేశారు.