జై లవకుశ సెకండ్ టీజర్ రిలీజ్ డేట్

Thursday,July 13,2017 - 03:16 by Z_CLU

NTR ‘జై లవకుశ’ సెకండ్ టీజర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. రీసెంట్ గా రిలీజైన జై టీజర్ NTR లోని విలనిజాన్ని ఎలివేట్ చేసింది. రావణుడి భక్తుడైన జై క్యారెక్టర్ లో NTR విలన్ లుక్స్ లో ఎట్రాక్ట్ చేసేశాడు. కేవలం 48 గంటల్లో కోటి వ్యూస్ రీచ్ రికార్డ్ అయ్యాయంటే ఈ సినిమా ఫ్యాన్స్ లో ఏ రేంజ్ డిమాండ్ క్రియేట్ చేసుకుందో అర్థమై పోతుంది.

అయితే ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, ఈ సినిమా సెకండ్ టీజర్ ని ఈ నెల లాస్ట్ వీక్ కల్లా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ టీజర్ లో ‘లవకుమార్’ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయనున్న ‘జై లవకుశ’ టీమ్, ఆల్ రెడీ ఈ టీజర్ మేకింగ్ ప్రాసెస్ లో ఉంది.

బాబీ డైరెక్షన్ లో  తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 21 న రిలీజ్ కానుంది.