'జై లవకుశ' ఫస్ట్ లుక్ రిలీజ్ డీటెయిల్స్...

Tuesday,May 09,2017 - 10:00 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘జై లవకుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సందడి చేయడానికి రెడీ అవుతుంది.. ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేత థామస్, నందిత శ్వేతా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. బాబీ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి..

శ్రీరామ్ నవమి సందర్భంగా టైటిల్ లోగో పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పిన మేకర్స్ త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చేందుకు చూస్తున్నారట. ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫాన్స్ ను ఎన్టీఆర్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఖుషి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట నిర్మాత కళ్యాణ్ రామ్.

ఎన్టీఆర్ బర్త్ డే కంటే ఒక రోజు ముందే అంటే మే 19 న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.. సో మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫాన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడన్నమాట…