వేటాడే పులి ‘గర్జన’

Saturday,January 04,2020 - 12:47 by Z_CLU

మనిషి, జంతువు… వీరిలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం? ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువు దాడి చేస్తుంది… మనిషి దాడి చేయడానికి కారణం అవసరం లేదు. ఈ అంశం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘గర్జన’. శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై ఎం.నరేష్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ పులి వేట ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా కోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ పులిని యానిమేషన్ ద్వారా తయారుచేశారు. అచ్చమైన పులి అనే ఫీలింగ్ కలిగిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

టామ్ అండ్ జెర్రీ కథ మాదిరిగా సాగే ఈ వేట చివరికి ఎలా ముగుస్తుందో తెర మీద చూడాల్సిందే. కథ, స్క్రీన్ప్ ప్లే, సినిమాట్రోగ్రఫీ ఎంవీ పన్నీర్ సెల్వమ్ నిర్వర్తించారు. జె.పార్తిబన్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు బాలా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు పార్తిబన్.