లూసిఫర్ లో మరో సీనియర్ హీరో

Thursday,July 02,2020 - 05:00 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతోంది లూసిఫర్ రీమేక్. టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చిన్నచిన్న మార్పులతో వస్తున్న ఈ ప్రాజెక్టును సుజీత్ డైరక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే సుజీత్ చెప్పిన వెర్షన్ కు చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రస్తుతం నటీనటుల్ని ఎంపికచేసే పనిలో పడ్డాడు సుజీత్. ఇందులో భాగంగా ఓ సీనియర్ నటుడ్ని సంప్రదించాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే లూసిఫర్ రీమేక్ లో ఓ కీలక పాత్రలో జగపతిబాబు కనిపించే అవకాశం ఉంది. ఈ మేరకు జగపతిబాబు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

చిరంజీవి నటించిన సైరా సినిమాలో కీలకపాత్ర పోషించాడు జగపతిబాబు. ఇప్పుడు లూసిఫర్ లో కూడా మరో పాత్రకు ఎంపికయ్యాడు. ఈ రీమేక్ లో ఇప్పటికే ఖుష్బూ ఎంటరైంది. చిరంజీవి సిస్టర్ పాత్రలో ఆమె కనిపించనుంది.