సైరా.. ఈసారి జగపతిబాబు లుక్

Tuesday,February 12,2019 - 11:44 by Z_CLU

సైరా సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్ వచ్చింది. ఈసారి జగపతి బాబు లుక్ ను విడుదల చేశారు. సినిమాలో వీరా రెడ్డి అనే పాత్రను పోషిస్తున్నాడు జగపతిబాబు. ఆ పాత్రకు సంబంధించిన లుక్ ఇది. మీసాలు, గడ్డాలు,
జులపాలు, తలపాగాతో వెరీ వెరీ స్పెషల్ గా కనిపిస్తున్నాడు జగ్గూ భాయ్.

సైరా సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి నుంచి అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్న.. ఇలా చాలామంది నటీనటుల ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. ఇన్నాళ్లకు జగపతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే టైమ్
వచ్చింది. ఈరోజు జగపతిబాబు పుట్టినరోజు. అందుకే బర్త్ డే గిఫ్ట్ గా సైరా నుంచి ఈ ఫస్ట్ లుక్ వచ్చింది.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో విలక్షణ పాత్రలు పోషిస్తున్నాడు జగపతిబాబు. శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, సాక్ష్యం, గూఢచారి, అరవింద సమేత, యాత్ర.. ఇలా ఎన్నో సినిమాల్లో ఒకదానితో మరొకటి సంబంధం లేని క్యారెక్టర్స్ చూపిస్తున్నాడు. ఇప్పుడీ విలక్షణ పాత్రల జాబితాలోకి వీరారెడ్డి క్యారెక్టర్ కూడా చేరబోతోంది.