జాకీ చాన్‌ 'కుంగ్‌ ఫూ యోగ' రిలీజ్ డేట్

Thursday,January 26,2017 - 03:02 by Z_CLU

జాకీచాన్ లేటెస్ట్ యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీ కుంగ్ ఫూ యోగ. సోనూసూద్‌, దిశ పటాని, అమైరా దస్తూర్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను కల్పన మూవీస్ బ్యానర్ పై కోనేరు కల్పన సమర్పిస్తున్నారు.

jackie-chan-aarif-lee-mu-qimiya-disha-patani
ఈ చిత్రానికి స్టాన్‌లీ టాంగ్‌… యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేశాడు. గతంలో జాకీ చాన్‌, స్టాన్‌లీ టాంగ్‌ కాంబినేషన్‌లో రూపొందిన రంబుల్‌ ఇన్‌ ది బ్రాంక్స్‌, ది మిత్‌, చైనీస్‌ జోడియాక్‌ వంటి చిత్రాలు కలెక్షన్‌ పరంగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించాయి. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ‘కుంగ్‌ ఫూ యోగ’ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. జాకీ చాన్‌ మార్క్‌ యాక్షన్‌ కామెడీయే కాకుండా ఈ చిత్రంలో ఎన్నో ఫ్రెష్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి. జాకీ చాన్‌, ఆరిఫ్‌ లీ, లే జాంగ్‌ పాల్గొన్న కార్‌ ఛేజ్‌.. సినిమాకి పెద్ద హైలైట్‌ కాబోతోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రం రూపొందింది. ముఖ్యంగా రకరకాల జంతువులు పిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటాయి.