జాను రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,January 22,2020 - 02:55 by Z_CLU

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న జాను సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 7న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. వాలంటైన్స్ డే కానుకగా ఈ సినిమా వస్తుందనే గాసిప్స్ ను అలా నిజం చేశాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. తాజాగా ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. టీజర్ రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఓ పాట కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే మినిమం గ్యాప్స్ లో అన్ని సాంగ్స్ ను రిలీజ్ చేయబోతున్నారు.

తమిళ్ లో సూపర్ హిట్టయిన 96సినిమాకు రీమేక్ గా వస్తోంది జాను. విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్, త్రిష పాత్రలో సమంత నటిస్తున్నారు. ఒరిజినల్ మూవీని డైరక్ట్ చేసిన ప్రేమ్ కుమార్, తెలుగు రీమేక్ కు కూడా దర్శకత్వం వహించాడు.

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
సంగీతం: గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి