చాలా కష్టమంటున్న అఖిల్

Monday,July 24,2017 - 01:15 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఓ విషయం చాలా కష్టమంటూ రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇంతకీ అఖిల్ చాలా కష్టమంటుంది మరేదో విషయం గురించి కాదు సినిమాటోగ్రఫీ గురించి అట.

ప్రెజెంట్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న అఖిల్ ఈ సినిమా షూటింగ్ లో సరదాగా కెమెరా పట్టుకొని సినిమాటోగ్రాఫర్ అవతారమెత్తాడు. ఓ షాట్ ను కెమెరామెన్ గా తన యాంగిల్ లో చూసిన అఖిల్ కెమెరాను హ్యాండిల్ చేయడం చాలా కష్టమంటూ చెప్పుకొచ్చాడు.

టెక్నీషియన్ గా కెమెరా ను హ్యాండిల్ చేయడం చాలా కష్టమని తెలుసుకున్న అఖిల్ ఇంకో సారి ఈ పని చేయనంటూ నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా తెలిపాడు. సో ఇంకో సారి సరదాగా కూడా అఖిల్ కెమెరామెన్ అవతారమెత్తదన్నమాట.