నాగచైతన్యకి ఇది ఫ్యామిలీ టైమ్

Thursday,March 07,2019 - 12:01 by Z_CLU

నాగచైతన్య, సమంతా ఇద్దరూ బిజీ బిజీగా ఉండే స్టార్సే. అందునా చాలా వరకు అవుట్ డోర్ షూటింగ్స్ ఉంటాయి కాబట్టి గట్టిగా ప్లాన్ చేసుకుంటే కానీ,  పెద్దగా టైమ్ దొరకదు. ఇది స్వయంగా చైతు ఒక సినిమా ప్రమోషన్ లో చెప్పుకున్న మాటే. కానీ గమనిస్తే గత కొన్ని నెలలుగా నాగచైతన్యకి కంప్లీట్ గా ఫ్యామిలీ టైమ్ నడుస్తుందనిపిస్తుంది.

నిన్నా మొన్నటి వరకు కంప్లీట్ గా సమంతా తోనే ఉన్నాడు చైతు. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని నాళ్ళు, కనీసం వేరే సినిమా పనులు కూడా ఏమీ పెట్టుకోలేదు. రీసెంట్ గా ఈ సినిమాకి ప్యాకప్ చెప్పాకే నెక్స్ట్ సినిమా సెట్స్ పైకి వచ్చాడు. ఇక్కడ ఏముంది స్వయంగా మామ కాంబినేషన్ లో సినిమా. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ అదే ఫ్యామిలీ టైమ్ కంటిన్యూ అవుతుంది.

పెళ్ళి తరవాత స్యామ్, చైతు కాంబినేషన్ లో వస్తున్న ‘మజిలీ’ పై ఎన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో, ఈ మామా- మేనల్లుళ్ళ సినిమాపై కూడా ఆ స్థాయిలోనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి లాంటి టాక్స్ వినిపిస్తున్నా, ఈ మామా అల్లుళ్ళు ఏం చేసినా అదిరిపోతుందనే ఫీలింగ్ ఫ్యాన్స్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తుంది.

సాధారణంగా ఒక సినిమాపై వైబ్స్ క్రియేట్ అయ్యాయంటే దానికి వేరియాస్ రీజన్స్ ఉంటాయి. కానీ ఈ 2 సినిమాలపై మాత్రం జస్ట్ కాస్టింగ్ వల్లే ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. చూస్తుంటే చైతు ఈ 2 సినిమాలు సక్సెసయితే ఫ్యామిలీతో మరిన్ని సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నట్టే అనిపిస్తుంది.