మరోసారి తేజూ సినిమాకు తమన్ సంగీతం

Tuesday,October 03,2017 - 11:16 by Z_CLU

సాయిధరమ్ తేజ్-తమన్ బంధం సినిమా సినిమాకు బలపడుతోంది. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో తిక్క, విన్నర్ సినిమాలొచ్చాయి. త్వరలోనే జవాన్ సినిమా కూడా రాబోతోంది. ఇలా వరుసగా తమన్ కే అవకాశాలిస్తున్న సాయిధరమ్ తేజ్.. తన అప్ కమింగ్ మూవీని కూడా అతడికే అప్పగించాడు.

ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎఁటర్ టైనర్ చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. కానీ మ్యూజిక్ డైరక్టర్ ను మాత్రం ఫైనల్ చేయలేదు. ఎంతోమంది పేర్లను పరిశీలించిన తర్వాత.. మరోసారి తమన్ కే ఛాన్స్ ఇచ్చారు. గతంలో వినాయక్ డైరక్షన్ లో వచ్చిన నాయక్ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.

వినాయక్-తేజూ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. త్వరలోనే మరో షెడ్యూల్ హైదరాబాద్ లోనే స్టార్ట్ అవుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నాడు.