ఆ వార్త నిజం లేదు..

Monday,March 06,2017 - 07:04 by Z_CLU

ఈ మధ్య ‘బాహుబలి-2’ కి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేయడం దానికి యూనిట్ జవాబివ్వడం సాధారణ మైపోయింది… అయితే అలాంటి ఓ వార్తే మళ్ళీ ‘బాహుబలి-2’ ను చుట్టుముట్టింది..


ఇటీవలే ‘ఘాజీ’, ‘గుంటూరోడు’ సినిమాకు వాయిస్ ఓవర్ అందించిన మెగా స్టార్ చిరు ‘బాహుబలి 2’ కి కూడా వాయిస్ ఇవ్వబోతున్నాడనే వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేసింది… ఈ సినిమాకు చిరు వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని భావించిన జక్కన్న ఇటీవలే చిరు ని కలిసి మాట్లాడారని ఇందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ కూడా వినిపించింది. అయితే లేటెస్ట్ గా బాహుబలి కి చిరు వాయిస్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని సోషల్ మీడియా ద్వారా తేల్చిచెప్పేశాడు రాజమౌళి…