రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఇస్మార్ట్ శంకర్

Monday,May 06,2019 - 11:32 by Z_CLU

లాంఛింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ జరుగుతూనే ఉంది. షెడ్యూల్స్ మధ్య చిన్న చిన్న గ్యాప్స్ తప్పిస్తే ఎక్కడా షూటింగ్ ఆగలేదు. అలా సినిమాకు సంబంధించిన కీలక షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసింది యూనిట్. తాజాగా జరిగిన వారణాసి షెడ్యూల్ తో మూవీకి సంబంధించి యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయింది.

వారణాసి నుంచి తిరిగొచ్చిన యూనిట్ వెంటనే కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది. మరో 2 రోజుల్లో ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. పూరి జగన్నాధ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో కనిపించనంత మాస్ గా కనిపిస్తున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు.