పార్టీ చేసుకున్న ఇస్మార్ట్ శంకర్

Monday,March 25,2019 - 11:59 by Z_CLU

పూరి జగన్నాధ్ సినిమాలంటేనే ఫాస్ట్ గా కంప్లీట్ అవుతాయి. ఇస్మార్ట్ శంకర్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఈమధ్యే లాంఛ్ అయిన ఈ సినిమా ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. తాజాగా గోవాలో మరో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు.

గోవా షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీం రాత్రి పెద్ద పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో హీరో రామ్, హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్ తో పాటు కీలకమైన యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. మరోవైపు పూరీ జగన్నాధ్ తనయుడు, రొమాంటిక్ సినిమాలో హీరోగా నటిస్తున్న ఆకాష్ పూరి కూడా ఈ పార్టీలో మెరిశాడు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరో భారీ షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.