కాస్త లేట్ అయినా అదే తోపు, అదే ఊపు

Sunday,June 23,2019 - 04:30 by Z_CLU

లెక్కప్రకారం వచ్చేనెల 12న రిలీజ్ అవ్వాలి ఇస్మార్ట్ శంకర్ మూవీ. కానీ ఈ సినిమా ఓ 6 రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని హీరో రామ్ స్వయంగా ప్రకటించాడు. జులై 18న ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశాడు.

కాస్త లేట్ అయినా అదే తోపు, అదే ఊపు అంటూ ట్వీట్ చేశాడు రామ్. ఇప్పటికే సినిమా ప్రమోషన్ హై-మోడ్ లో జరుగుతోంది. బ్యాక్ టు బ్యాక్ సింగిల్స్ రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు సాంగ్స్ షూటింగ్ కూడా శరవేగంగా పూర్తిచేస్తున్నారు.

ఓవైపు వర్షాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ, మరోవైపు షూటింగ్ కొనసాగిస్తోంది యూనిట్. త్వరలోనే సినిమాకు సంబంధించి ఆడియో ఫంక్షన్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్స్ ఎనౌన్స్ చేయబోతున్నారు. పూరి జగన్నాధ్ డైరక్ట్ చేస్తున్న ఈ మూవీలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు.